వెండి నాణేల కోసం భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు

  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు
  • భక్తులకు వెండి నాణేల పంపిణీ 
  • అనవాయితీగా వెండి నాణేలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పిన ఆలయ ట్రస్టీ శంభు
దీపావళి వేడుకలు పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజల నిర్వహించారు. అనవాయితీ ప్రకారం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలను పంపిణీ చేశారు. దీంతో వెండి నాణేల కోసం భక్తులు పోటెత్తారు. ఏడాది అంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో తయారు చేసిన నాణేలను దీపావళి పండుగ రోజున భక్తులకు అందించడం ఇక్కడ అనవాయితీగా వస్తుందని ఆలయ ట్రస్టీ శంభు తెలిపారు.
.

diwali celebrations
bhagyalaxmi temple
old city
Hyderabad

More Telugu News